అదనపు కట్నం తేలేదని కొడలికి హెచ్‌ఐవీ వైరస్ ఎక్కించిన అత్తమామలు
అదనపు కట్నం కానుకలు ఇవ్వలేదనే కోపంతో అత్తమామలు కొడలికి హెచ్‌ఐవీ వైరస్‌తో కలుషితమైన ఇంజెక్షన్ ఇచ్చారు.

అదనపు కట్నం కానుకలు ఇవ్వలేదనే కోపంతో అత్తమామమలు కొడలికి హెచ్‌ఐవీ వైరస్‌తో కలుషితమైన ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ ఘటన యూపీలోని సహారాన్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2023 ఫిబ్రవరి 15న గంగో ప్రాంతానికి చెందిన సోనాల్ సైనీకి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్‌తో వివాహం జరిగింది. కారు, రూ.15 లక్షలు కట్నంగా ఇచ్చారు. కాగా, కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం అత్తింటి వారు సోనాల్‌ను వేధించారు. స్కార్పియో ఎస్‌యూవీతోపాటు రూ.25 లక్షలు డిమాండ్ చేశారు.
కొన్నాళ్లు బాగానే ఉన్న అత్తింటి వారు కొంతకాలం తర్వాత స్కార్పియో కారు కొనడానికి తల్లిగారి దగ్గర నుంచి మరో రూ.25 లక్షలు తీసుకురావాలని కోడలిని వేధించసాగారు. తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని యువతి తల్లిదండ్రులు పేర్కొనడంతో ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. అయితే పెద్దల జోక్యంతో సోనాల్ తిరిగి అత్తవారింటికి వచ్చింది. నాటి నుంచి ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించారు. సోనాల్‌ను చంపేందుకు కుట్రపన్నారు. హెచ్ఐవీ సోకిన సూదితో ఆమెకు ఇంజెక్షన్ చేశారు. మరోవైపు సోనాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా సోనాల్‌కు హెచ్‌ఐవీ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆమె భర్త అభిషేక్‌ను పరీక్షించగా హెచ్‌ఐవీ నెగిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో సోనాల్ అత్తింటి వారిపై ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు