Telugu Global
National

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై కీలక నిర్ణయం

తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై కీలక నిర్ణయం తీసుకున్నారు.

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై కీలక నిర్ణయం
X

తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో డీఎంకేను ఓడించే వరకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. రేపటి నుంచి 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నాను అని స్పష్టం చేశారు. అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన విషయంలో అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొయంబత్తూరులోని తన ఇంటి దగ్గర రాష్ట్రంలో దుష్ట పాలన అంతం కావాలని ఆరు సార్లు కొరడాలతో కొట్టుకుంటా అన్నారు. లైంగిక వేధింపుల కేసులో 19 ఏళ్ల యువతి వివరాలను లీక్ చేసినందుకు పోలీసులపై ఆయన మండిపడ్డారు.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న 37 ఏళ్ల జ్ఞాన శేఖరన్ డీఎంకే నేతలతో దిగిన ఫొటోలను ఆయన రివీల్ చేసి మీడియా ఎదుట ప్రదర్శించారు. నార్త్-సౌత్ పాలిటిక్స్ పేరిట డీఎంకే రాష్ట్రంలోని సమస్యలను డైవర్షన్ చేస్తోందని ఆయన ఫైర్‌య్యారు .డీఎంకే ప్రభుత్వన్నిగద్దేదించేవారుకు పాద రక్షలు లేకుండానే నడుస్తాను. డబ్బులు పంచి ఎన్నికలు గెలవాలని తాము భావించడం లేదు. డబ్బులు వృథా చేయకుండా ఈ ఎన్నికల్లో పోరాడతాం.’ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో డీఎంకే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందన్నారు. మీడియాతో మాట్లాడుతుండగానే షూస్ తీసేసిన అన్నామలై.. డీఎంకే అధికారం కోల్పోయాకే మళ్లీ షూస్ ధరిస్తానన్నారు.

First Published:  26 Dec 2024 6:54 PM IST
Next Story