Telugu Global
National

పోలీసులకు ‘గృహమంత్రి దక్షతా పదక్‌’ అవార్డులు

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాదికి గానూ ‘తెలుగు రాష్ట్రాల పోలీసులకు ‘గృహమంత్రి దక్షతా పదక్‌’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

పోలీసులకు ‘గృహమంత్రి దక్షతా పదక్‌’ అవార్డులు
X

ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాదికి గానూ ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్‌ అవార్డులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇవాళ ప్రకటించింది. ప్రత్యేక ఆపరేషన్లు, దర్యాప్తు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ తదితర విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బందికి ఈ అవార్డులను అందజేయనుంది. దేశవ్యాప్తంగా 463 మంది పోలీసు సిబ్బందికి అవార్డులు దక్కాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ఏపీ, తెలంగాణ సహా అస్సాం, బిహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు, దిల్లీ, జమ్మూకశ్మీర్‌, చండీగఢ్‌ తదితర కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పోలీసులు, సీఆర్పీఎఫ్‌, సీబీఐ, ఎన్‌ఐఏ, ఎన్సీపీ, ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ బలగాల సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు.

ఏపీ నుంచి ఇద్దరు ఎస్పీలు, తెలంగాణ నుంచి ఒక ఎస్పీతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పోలీసు కానిస్టేబుళ్లకు ఈ పురస్కారాలు దక్కాయి. ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. గుజరాత్‌ కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ వద్ద పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా పరేడ్‌ నిర్వహించగా.. బలగాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు.

First Published:  31 Oct 2024 3:19 PM IST
Next Story