Telugu Global
National

గుజరాత్‌లో నాలుగుకు చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు

భారత్ లో మరో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ కేసు నమోదైంది.

గుజరాత్‌లో నాలుగుకు చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు
X

భారత్‌లో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ మరొకరికి సోకింది. గుజరాత్‌లో తొమ్మిది నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో భారత్ లో మొత్తం హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ కేసులన్నీ వారం రోజుల్లోనే నమోదం అవడం కలకలం రేపుతుంది. తాజా కేసు.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో తొమ్మిది నెలల చిన్నారి జనవరి 6న జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్న మగశిశువును నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించడంతో.. చిన్నారి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపగా.. హెచ్ఎంపీవీగా నిర్ధారణ అయింది.

అయితే ఆ చిన్నారి విదేశీ పర్యటనలు గాని, ఇతర పర్యటనలు ఏవీ చేయలేదని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలియ జేశారు. నగరంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే అత్యవసర పరిస్థితి ప్రకటిస్తామని వెల్లడించారు. జనవరి 9న అహ్మదాబాద్‌లో 80 ఏళ్ల వృద్ధుడికి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ పాజిటివ్‌గా తేలింది. ఆస్తమాతో బాధపడుతున్న ఆ రోగి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు జనవరి 6న గుజరాత్‌లో హెచ్ఎమ్‌పీవీ తొలి కేసు నమోదైంది.

First Published:  11 Jan 2025 7:47 PM IST
Next Story