కాంగ్రెస్ మాజీ ఎంపీకి జీవిత ఖైదు
కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ జీవిత ఖైదు విధిస్తూ దిల్లీ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.

ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. తన భర్త, కుమారుడి మరణానికి ఆయనే కారణమని, తనకు న్యాయం కావాలని బాధుతురాలు 41 ఏళ్లుగా కోర్టులో పోరాడారు. ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అల్లర్ల సమయంలో సరస్వతీ విహార్ ప్రాంతంలో జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్‌దీప్ సింగ్‌ను హతమార్చారన్న కేసులో ఆయనను ఇటీవల దోషిగా తేల్చిన ప్రత్యేక న్యాయమూర్తి.. తాజాగా శిక్ష ఖరారు చేశారు.
సిక్కు అల్లర్లకు సంబంధించిన మరో కేసులో ఇప్పటికే సజ్జన్ తిహాడ్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఇవేకాక ఆయనపై మరో రెండు కేసులు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి. 1984లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హత్య అనంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో సజ్జన్ కుమార్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, అతడు ఒక బృందానికి నాయకత్వం వహించినట్లు కోర్టు ప్రాథమికంగా నిర్ధారించింది.