Telugu Global
National

ముడా స్కామ్ కేసు ఎఫెక్ట్.. కర్ణాటకలో సీబీఐకి నిషేధం

ముడా స్కామ్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలనే డిమాండ్ వస్తున్న నైపథ్యంలో సిద్దరామయ్య సర్కారు కర్ణాటకలో సీబీఐ దర్యాప్తును నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ముడా స్కామ్ కేసు ఎఫెక్ట్..  కర్ణాటకలో సీబీఐకి నిషేధం
X

కర్ణాటకలో సీబీఐని నిషేధిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. ముడా స్కామ్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలనే డిమాండ్ వస్తున్న నైపథ్యంలో సిద్దరామయ్య సర్కారు కర్ణాటకలో సీబీఐ దర్యాప్తును నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ పక్షపాత చర్యల నేపథ్యంలో గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నట్లు కర్నాటక న్యాయశాఖ మంత్రి హెచ్ కే పాటిల్ తెలిపారు. బీజేపీ చెప్పుచేతల్లో పనిచేస్తున్న సీబీఐ పక్షపాత ధోరణి కారణంగానే ఆ సంస్థ దర్యాప్తులపై ఉన్న అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

సీఎం సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న ముడా భూముల కేసులో ఆయన్ను అరెస్టు చేస్తారనే భయాలు ఇందుకు కారణం కాదని న్యాయమంత్రి తెలిపారు. సీబీఐకి తాము గతంలో ఎన్నో కేసులు అప్పగించి దర్యాప్తు చేయించామని, కానీ ఛార్జిషీట్లు మాత్రం వేయడం లేదనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే తాము ఎన్నో కేసులు సీబీఐకి ఇచ్చామని, కానీ వాటిలో దర్యాప్తులు సైతం ముందుకు సాగడం లేదని ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయని మంత్రి హెచ్ కే పాటిల్ పెర్కొన్నారు. కాబట్టి ఇకపై ఇలాంటి పక్షపాత చర్యలకు పాల్పడకుండా సీబీఐకి అడ్డుకట్ట వేయడమే తమ నిర్ణయం వెనుక కారణమని వెల్లడించారు. ఇప్పటికే విపక్షాలు అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సీబీఐ ప్రవేశంపై నిషేధం అమల్లో ఉంది.

ముడా స్థల కేటాయింపు కేసులో సీఎం విచారణను ఎదుర్కొంటారు. గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతిని హైకోర్టు సమర్థించిన తర్వాత. అవినీతి ఆరోపణలను చాలా అరుదుగా ఎదుర్కొన్న సిద్ధరామయ్యకు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసు మొదటి పెద్ద సవాలుగా మారింది. పార్వతి ముడా నుండి "అక్రమ" పరిహార భూమి ఒప్పందం నుండి లబ్ది పొందారని మరియు ఆరోపించిన అక్రమాలు రూ. 4,000 కోట్లుగా ఉన్నాయని బిజెపి నేతృత్వంలోని ప్రతిపక్షాలు మరియు కొంతమంది కార్యకర్తలు ఆరోపించారు. చౌకగా ఉన్న భూమిని బదలాయించి విలువ ఉన్న ల్యాండ్‌ను రిజిస్టర్ చేసుకున్నాట్లు ముఖ్యమంత్రి భార్యపై ఆరోపణలున్నాయి

First Published:  26 Sept 2024 3:26 PM GMT
Next Story