Telugu Global
National

కెనడాలోని దౌత్యవేత్తలు వెనక్కి..కేంద్రం సంచలన నిర్ణయం

కెనడాలోని భారత రాయబారులను వెనక్కి కేంద్రం పలిపించింది. ‘ఉగ్రవాదం, హింసాత్మక వాతావరణంలో ట్రూడో ప్రభుత్వం చర్యలు భారత ధౌత్యాధికారుల భద్రతకు అపాయం కలిగించేలా ఉన్నట్లు తెలుస్తున్నదని పేర్కొన్నాది

కెనడాలోని దౌత్యవేత్తలు వెనక్కి..కేంద్రం సంచలన నిర్ణయం
X

భారత్-కెనడా మధ్య విభేదాల నేపథ్యంలో దౌత్యసంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి.ఈ నేపధ్యంలో కెనడాలోని భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను వెనక్కి రప్పించాలని భారత సర్కార్ నిర్ణయం తీసుకుంది.కెనడాలోలో గత ఏడాది జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు విచారణలో భాగంగా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితుల జాబితాలో ట్రుడూ సర్కార్ చేర్చింది. ఇందుకు సంబంధించి కెనడా నుంచి దౌత్య సమాచారం ఆదివారం భారత్‌కు చేరడంతో ఇండియా నిప్పులు చెరిగింది.

ట్రూడో ప్రభుత్వ అభియోగం పూర్తిగా అసంబద్ధమని పేర్కొంటూ, దీనిపై నిరసన తెలిపేందుకు కెనడా డిప్యూటీ హై కమిషనర్ స్టెవార్డ్ వీలర్‌కు భారత్ సమన్లు పంపింది.కెనడాలోని భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను, అధికారులను వెనక్కి పిలిపించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది.కెనడాలోని తమ దౌత్యవేత్తలకు రక్షణ లేదని, అందుకే వెనక్కి పిలిపించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాది. తమ దౌత్యవేత్తలకు భద్రత కల్పించే విషయంలో ప్రస్తుత కెనడా ట్రూడో సర్కార్‌పై తమకు నమ్మకం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో హైకమిషనర్ సహా దౌత్యవేత్తలు వెనక్కి వస్తున్నారు.

First Published:  14 Oct 2024 9:08 PM IST
Next Story