Telugu Global
National

అభివృద్ధి పేరుతో ప్రకృతి వనరుల విధ్వంసం

పర్యావరణ విధ్వంసంతో ఆదివాసీలకు తీవ్ర నష్టమన్న మేధా పాట్కర్‌

అభివృద్ధి పేరుతో ప్రకృతి వనరుల విధ్వంసం
X

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడవద్దని నర్మదా బచావో ఆందోళన్‌ ఉద్యమకారిణి మేధాపాట్కర్‌ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సదస్సుకు ఆమె హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణానికి నష్టం చేసే విధానాలను తీసుకురావడంతో ఆదివాసీలు, నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మండిపడ్డారు. పర్యావరణానికి హాని కలిగే పరిశ్రమలకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో నదీ జలాలు కలుషితమవుతున్నాయని మేధాపాట్కర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో 24 రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

First Published:  2 March 2025 11:42 AM IST
Next Story