ఢిల్లీ సచివాలయం సీజ్
సచివాలయంలోని ఏ ఒక్క ఫైల్ బయటకు వెళ్లొద్దని లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా ఆదేశాలు జారీచేశారు
BY Vamshi Kotas8 Feb 2025 2:30 PM IST
![ఢిల్లీ సచివాలయం సీజ్ ఢిల్లీ సచివాలయం సీజ్](https://www.teluguglobal.com/h-upload/2025/02/08/1401558-sachiva.webp)
X
Vamshi Kotas Updated On: 8 Feb 2025 2:30 PM IST
ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేశారు. . సచివాలయంలోని ఫైల్స్, రికార్డ్స్ బయటకెళ్లకూడదంటూ సచివాలయ అధికారులకులెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని కూడా ప్రధాని మోదీ వెల్లడించారు. ఫైల్స్, రికార్డ్స్ భద్రతపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు.
ఢిల్లీలో ఆప్ ఓటమితో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సక్సేనా ఆదేశాలు సంచలనంగా మారాయి. గత పదేళ్లుగా ఆప్ ప్రభుత్వ పాలనపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది. తాము అధికారంలోకి రాగానే కేజ్రీవాల్ అవినీతిపై సిట్ విచారణ చేస్తామని, అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశ పెడతామని తెలిపారు.
Next Story