Telugu Global
National

మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ అబ్జర్వర్లు

నియమించిన ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే

మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ అబ్జర్వర్లు
X

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ సన్నద్ధమవుతోంది. రెండు రాష్ట్రాలకు పార్టీ సీనియర్‌ అబ్జర్వర్లను నియమిస్తూ ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. రెండు రాష్ట్రాల అబ్జర్వర్లు, ఇన్‌ చార్జీల పేర్లను ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ వెల్లడించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్ట విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీతక్కకు అబ్జర్వర్లుగా అవకాశం కల్పించారు. మహారాష్ట్రలోని ముంబయి, కొంకన్‌ డివిజన్‌ సీనియర్‌ అబ్జర్వర్లుగా అశోక్‌ గెహ్లాట్‌, జి. పరమేశ్వర, విదర్భ (అమరావతి, నాగ్‌ పూర్‌)కు భూపేశ్‌ భగేల్‌, చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీ, ఉమాంగ్‌ సింగార్‌, మరాఠ్వాడకు సచిన్‌ సైలెట్‌, కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వెస్ట్రన్‌ మహారాష్ట్రకు టీఎస్‌ సింగ్‌ దేవ్‌, ఎంబీ పాటిల్‌, నార్త్‌ మహారాష్ట్రకు ఎస్‌డీ నాసిర్‌ హుస్సేన్‌, ధనసరి అనసూయ సీతక్క, స్టేట్‌ ఎలక్షన్‌ సీనియర్‌ కో ఆర్డినేటర్లుగా ముకుల్‌ వాస్నిక్‌, అవినాశ్‌ పాండేను నియమించారు. జార్ఖండ్‌ ఎన్నికల సీనియర్‌ అబ్జర్వర్లుగా తారీఖ్‌ అన్వర్‌, అధిర్‌ రంజన్‌ చౌదరి, మల్లు భట్టి విక్రమార్కను నియమించారు. వీరి నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజే షెడ్యూల్‌ ప్రకటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అబ్జర్వర్లు, కో ఆర్డినేటర్లను నియమించింది.

First Published:  15 Oct 2024 3:05 PM IST
Next Story