రేప్ కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్టు
అత్యాచారం కేసులో యూపీ సీతాపూర్ కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అత్యాచారం కేసులో యూపీ సీతాపూర్ కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నాలుగేళ్లుగా రాకేష్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. యూపీ పోలీసులు ఆయనపై జనవరి 17న కేసు నమోదు చేశారు. ఎంపీ దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్ తిరస్కరించింది.పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఓ మహిళ జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్‌ను సైతం పోలీసులకు సమర్పించారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన ఫోన్స్ కాల్స్ లిస్ట్, సంభాషణలకు పోలీసులకు అందజేసింది.ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. రాకేష్ రాథోడ్‌ను ఈరోజు అరెస్ట్ చేశారు. అనంతరం, నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాకేష్‌ను అరెస్ట్ చేసే సమయంలో కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక, భారీ భద్రత మధ్య రాకేష్‌ను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.