వైల్డ్ చికెన్ వివాదంలో సీఎం సుఖు
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు ఈ మధ్య వరసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సుఖు మరోసారి వివాదంలో చిక్కున్నారు. ముఖ్యమంత్రి ఇతర నేతలు పాల్గొన్న విందులో వైల్డ్ చికెన్ వడ్డించారు. సుఖు ఆ చికెన్ తినప్పటికీ మంత్రి, ఇతర అతిథులకు దానిని వడ్డించారు. ఆ చికెన్‌ను మోనులో చేర్చడాన్ని తప్పుపడుతూ జంతు సంరక్షణ సంస్థ ఒక వీడియోను పోస్టు చేశారు. ఆ చికెన్ మెనూలో చేర్చడాన్ని తప్పు పడుతూ జంతు సంరక్షణ సంస్థ ఒకటి వీడియోను పోస్టు చేసింది.
దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 1972 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం.. రక్షిత జాతుల జాబితాలో వైల్డ్ చికెన్ కూడా ఉండటం విశేషం. వాటిని వేటాడటం శిక్షార్హం. దీంతో సీఎం, ఇతర నేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అదే ఆసరాగా తీసుకున్న ప్రతిపక్ష బీజేపీ.. సీఎంపై, కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శల దాడికి దిగింది.అయితే సుఖు తాను ఆ వంటకం తినలేదని చెప్పినా ఆరోగ్యశాఖ మంత్రి, ఇతర అతిథులకు చికెన్ వడ్డించారు .గతంలో సమోసాల వ్యవహారం రచ్చ రేపిన సంగతి తెలిసిందే.