పెళ్లిలో చిరుత పులి..4 గంటల పాటు కారులో వధువు
లఖ్‌నవూలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో చిరుతపులి వెళ్లి బెంబేలెత్తించింది.
![పెళ్లిలో చిరుత పులి..4 గంటల పాటు కారులో వధువు పెళ్లిలో చిరుత పులి..4 గంటల పాటు కారులో వధువు](https://www.teluguglobal.com/h-upload/2025/02/13/1403037-churutha.webp)
యూపీ రాజధాని లఖ్‌నవూలో జరిగిన ఓ వివాహ వేడుకలో అనుకోని అతిథి చిరతపులి కలకలం రేపింది. చిరతను చూసి పెళ్లికి వచ్చానవారు భయభ్రాంతులకు గురయ్యారు. వధువు 4 గంటలకుపైగా కారులోనే ఉండిపోయారు. పారెస్ట్ అధికారులు వచ్చి చిరుతను బంధించాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. లఖ్‌నవూలోని బుద్ధేశ్వర్ రోడ్‌లోని ఎంఎం లాన్ గెస్ట్ హౌస్‌లో రాత్రి పెళ్లి వేడుక జరుగుతుండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక చిరుతపులి లోపలికి ప్రవేశించింది.
దాన్ని చూసిన పెళ్లివారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఆ సమయంలో పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఫంక్షన్ హాల్లోనే ఉన్నారు. చిరుతను చూసి వారిద్దరూ పరుగున వెళ్లి కారులో కూర్చుని లాక్ చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడ 200 మందికిపైగా ఉన్నారు. వారు కూడా పారిపోయి దాక్కునే ప్రయత్నం చేశారు. రాత్రి 11:40 సమయంలో అందరూ పెళ్లి హడావుడిలో ఉండగా చిరుత లోపలికి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. జనాలను చూసిన చిరుత భవనంలోకి వెళ్లిపోయింది.