Telugu Global
National

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

రెండు తెలుగు రాష్ట్రాల‌కు కేంద్ర హోం శాఖ శుభవార్త చెప్పింది

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
X

కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది. విపత్తు, వరదల కారణంగా సాయం కింద ఏపీకి రూ. 608.8 కోట్లు, తెలంగాణ‌కు రూ. 231.75 కోట్ల హోం శాఖ విడుదల చేసింది. 2024లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టం, తుపాను వంటి ప్ర‌కృతి వైప‌రీత్యాల‌కు ప్ర‌భావిత‌మైన ఐదు రాష్ట్రాల‌కు నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డీఆర్ఎఫ్‌) కింద రూ. 1554.99 కోట్ల అద‌న‌పు స‌హాయం అందించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇక మొత్తం రూ. 1554.99 కోట్ల రిలీజ్ చేసింది. త్రిపుర‌కు రూ. 288.93 కోట్లు, ఒడిశాకు రూ. 255.24 కోట్లు, నాగాలాండ్ కు రూ. 170.99 కోట్లు ఇవ్వాల‌ని ఉన్న‌త స్థాయి క‌మిటీ నిర్ణ‌యించింది.

First Published:  19 Feb 2025 2:37 PM IST
Next Story