రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించడంతో పాటు ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబిల్ ఆయిల్- ఆయిల్ సీడ్స్’కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రతిపాదలను క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 11.72 లక్షల మందికి గరిష్ఠంగా రూ.17,951 చెల్లించునున్నారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబిల్ ఆయిల్- ఆయిల్ సీడ్స్’కు ఆమోదం తెలిపింది. రాబోయే ఆరేళ్లలో నూనెగింజల ఉత్పత్తికి రూ.10,103 కోట్లు ఖర్చు చేయనుంది. వంట నూనె దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, దేశంలో మరో ఐదు భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు ఆమోద ముద్ర వేసింది.
దీంతో మరాఠీ, పాళి, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా దక్కనుంది. ఇప్పటికే తెలుగు సహా ఆరు భాషలకు ప్రాచీన హోదా ఉన్న విషయం తెలిసిందే. ఫుడ్ సెక్యూరిటీతో రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ. చెన్నై మెట్రో ఫేస్-2కు ఆమోదం. రూ.63,246 కోట్లతో చెన్నై మెట్రో ఫేస్-2. 119 కిలోమీటర్లు, 3 కారిడార్లలో 120 మెట్రోస్టేషన్లు. ఫోర్ట్ ఉద్యోగుల కోసం ప్రొడక్టివిటీ లింక్ రివార్డ్. 20,704 మంది ఉద్యోగులకు లబ్ధి. రైల్వే ఉద్యోగుల కోసం ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ వంటి వాటికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.