Telugu Global
National

హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం..సీఎంగా ఆయనకే అవకాశమా?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా మూడోసారి బీజేపీ అధికారన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టింది.

హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం..సీఎంగా ఆయనకే అవకాశమా?
X

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా మూడోసారి కమలనాధులు అధికారన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టింది. హర్యానాలో కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ భారీ లీడ్ లో కొనసాగింది. క్రమంగా కమలం పార్టీ రేసులోకి వచ్చింది. మ్యాజిక్ ఫీగర్ 46 సీట్లును బీజేపీ క్రాస్ అయింది. మొత్తం 90 సీట్లుగాను ప్రస్తుతం బీజేపీ 48 కాంగ్రెస్ పార్టీ 37 చోట్ల గెలిచాయి. ఇతరుతు 5 స్థానాల్లో గెలిచారు. నూతన ముఖ్యమంత్రి ఎంపికకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 90 సీట్లకుగానూ 48 సీట్లు సాధించిన బీజేపీ.. ఐఎన్ఎల్డీ, ఇతరులను కలుపుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఢిల్లీలోని కమలం పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.

అయితే సీఎం రేసులో పలువురు ఉన్నప్పటికీ ఇప్పటికే బీజేపీ ఛాయిస్ క్లియర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానాలో మూడోసారి బీజేపీ గెలుపులో కీలకపాత్ర పోషించిన సీఎం నాయబ్ సింగ్ సైనీనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, ఇందులో మరో మాటకు తావులేదని బీజేపీ అధిష్టానం చెబుతున్నట్లు సమాచారం. ఓబీసీ వర్గాలకు చెందిన సైనీని సీఎంగా నియమించడం వల్లే తాము హ్యాట్రిక్ విజయం అందుకున్నట్లు భావిస్తున్న బీజేపీ.. ఆయనను సీఎంగా కొనసాగించడం ద్వారా ఆయా వర్గాలకు తాము అనుకూలమే అనే మెసేజ్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికలకు సరిగ్గా 200 రోజుల ముందు మనోహర్ లాల్ ఖట్టర్ స్ధానంలో అధిష్టానం నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా నియమించింది.

First Published:  8 Oct 2024 7:34 PM IST
Next Story