Telugu Global
National

బీజేపీ ఎంపీలు నన్ను తోయడంతో మోకాలికి గాయమైంది : ఖర్గే

రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

బీజేపీ ఎంపీలు నన్ను  తోయడంతో మోకాలికి గాయమైంది : ఖర్గే
X

పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలుపుతున్న తనను బీజేపీ ఎంపీలు తోయడంతో మోకాలికి గాయమైనట్టు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మకర్ ద్వార్ ఎంట్రన్స్ దగ్గర జరిగిన ఘర్షణ సందర్భంగా బీజేపీ ఎంపీలు తనను నెట్టివేశారని,దాంతో తాను అదుపుతప్పి కిందపడిపోయానని వెల్లడించారు. తన మోకాళ్లకు గాయమైందని ఆ లేఖలో పేర్కొన్నారు. తన మోకాళ్లకు అప్పటికే శస్త్రచికిత్స జరిగిందని, ఇప్పుడు కిందపడడంతో గాయం ప్రభావం మోకాళ్లపై ఎక్కువగా పడిందని ఖర్గే వివరించారు.

వెంటనే కాంగ్రెస్ ఎంపీలు ఓ కుర్చీ తీసుకురావడంతో దానిపై కూర్చున్నానని తెలిపారు. అక్కడ్నించి తాను కుంటుతూనే సభకు వెళ్లానని తెలిపారు. ఈ తోపులాట ఘటనపై విచారణ జరిపించాలని తన లేఖలో డిమాండ్ చేశారు. రాజ్యసభ విపక్ష నేతపై ఇలాంటి దాడి జరగడం గర్హనీయమని వివరించారు. అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విపక్షాలపై మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ ప్రాంగణం మొత్తం రణరంగాన్ని తలపించింది.

First Published:  19 Dec 2024 3:20 PM IST
Next Story