ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆయనపై దాడికి యత్నించగా.. ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఓ ద్రావణాన్ని పోయబోయాడు. దాంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అడ్డుకున్నారు. పాదయాత్రలో అరవింద్ కేజ్రీవాల్ మద్దతుదారుల మధ్య నడుచుకుంటూ వస్తున్నారు. ఒక్కసారిగా గుంపులో నుంచి వచ్చిన వ్యక్తి బాటిల్‌ను తీసి.. అందులో ఉన్న ఉన్న ద్రవాన్ని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిపై పోసేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
Previous Articleసీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేష్ మృతి
Next Article ఫెంగల్ తుపాను ఎఫెక్ట్… చెన్నై ఎయిర్‌పోర్ట్ మూసివేత
Keep Reading
Add A Comment