హీరో సల్మాన్‌ఖాన్‌కు మరో బెదిరింపు మెసేజ్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించి తప్పు చేశానని నిందితుడి నుంచి పోలీసులకు వాట్సాప్ సందేశం వచ్చింది. కృష్ణ జింకను వేటాడిన కేసులో బిష్ణోయ్ వర్గం సల్మాన్ ఖాన్‌పై గరంగా ఉంది.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను బెదిరించి చాల తప్పు చేశామని నిందితుడి నుంచి పోలీసులకు మరో మెసేజ్ వచ్చింది. ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని సల్మాన్‌ను బెదిరించిన సంగతి తెలిసిందే. అదే నంబర్ నుంచి ముంబై ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ వచ్చింది. అందులో సల్మాన్‌ను బెదిరించి తప్పు చేశామని అందులో నిందితుడు పేర్కొన్నాడు. ఈ సందేశం జర్ఖండ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణ జింకను వేటాడిన కేసులో బిష్ణోయ్ వర్గం సల్మాన్ ఖాన్‌పై ఆగ్రహంగా ఉంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో వైరానికి ముగింపు పలకాలంటే సల్మాన్ ఖాన్ రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు వచ్చాయి.
ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. ఈ మర్డర్ తామే చేసినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. ఈ క్రమంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న శత్రుత్వం ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని అక్టోబర్ 18న ముంబై ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ వచ్చింది. లేదంటే సిద్ధిఖీ కంటే దారుణ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఈ మెసేజ్‌లు ఝార్ఖండ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం పోలీసు బృందాలు ఝార్ఖండ్ వెళ్లాయి.