Telugu Global
National

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ.. సీఎం రేవంత్‌ హాజరు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 8 రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గోన్నారు

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ.. సీఎం రేవంత్‌ హాజరు
X

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై దిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమీక్ష సమావేశం ప్రారంభమైంది.ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఏపీ నుంచి ఆ రాష్ట్ర హోంమంత్రి అనిత హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు పాల్గొన్నారు. ఈ భేటీకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, కేరళ, పశ్చిమ్‌ బెంగాల్‌, యూపీ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతపై అమిత్‌షా సమీక్షిస్తున్నారు.

2026 నాటికి దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత, ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు పలు రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చలు జరుపనున్నారు. కాగా ఈ సమావేశం అనంతరం పలు అంశాలపై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులతో హాజరుకానున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ప్రధాని అపాయింట్మెంట్ దొరికితే.. వరదల నష్ట పరిహారం పెంపు, మూసీ సుందరీకరణ, ప్రక్షాళనకు సంబంధించిన నిధుల గురించి చర్చించనున్నట్లు తెలుస్తుంది.

First Published:  7 Oct 2024 12:52 PM IST
Next Story