రైల్వే ప్రయాణికులకు అలర్ట్..కీలక మార్పు
రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌కు నియమాలను మార్చుతూ ఐఆర్‌టీసీ నిర్ణయం తీసుకుంది
BY Vamshi Kotas17 Oct 2024 4:02 PM IST
X
Vamshi Kotas Updated On: 17 Oct 2024 4:02 PM IST
రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ అలర్ట్ ప్రకటించింది. అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌కు నియమాలను మార్చుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వే అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌ను 60 రోజులకు కుదించింది. ఇప్పటివరకు ఇది 120 రోజులుగా ఉంది. అయితే నవంబర్ 1వ తేదీ నుంచి 60 రోజులకు కుదిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.
ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఐఆర్‌టీసీ తెలిపింది. తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్, తదితర ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల విషయంలో బుకింగ్ నిబంధన యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. ఈ రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ సమయం ఇప్పటికే తక్కువగా ఉంది. అదే సమయంలో విదేశీయులకు 365 రోజుల అడ్వాన్స్ బుకింగ్ సమయం కొనసాగుతుందని వెల్లడించింది.
Next Story