Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    మోడీకి స‌మఉజ్జి కేసీఆర్ మాత్ర‌మే..

    By SarviJune 16, 20223 Mins Read
    మోడీకి స‌మఉజ్జి కేసీఆర్ మాత్ర‌మే..
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ”కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత నా సందేహాలు తొలగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని నాకు నమ్మకం కలుగుతోంది” అని ఆంధ్రప్రదేశ్ విభజనకు బద్ధ వ్యతిరేకి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిరంతరం చులకనగా, అవహేళనగా మాట్లాడుతూ వచ్చిన, మూడు దశాబ్దాలకు పైగా హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్న కరుడుగట్టిన సమైక్యవాది, కోస్తాఆంధ్ర కమ్మ సామాజికవర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టు అప్పట్లో అన్నాడు. ఆయనే కాదు, ఆ కాలంలో చాలామంది ‘సెటిలర్లు’ తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని బల్ల గుద్ది వాదిస్తూ వచ్చేవారు. అందులో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, మీడియా సంస్థల అధిపతులు, ఎడిటర్లు.. పలు రంగాల వాళ్ళు ఉండేవారు. ‘తెలంగాణ విడిపోకూడద’న్న ఆకాంక్ష నుంచే కేసీఆర్ ను, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే వాళ్ళు.

    అయితే కేసీఆర్ తో ముఖాముఖి మాట్లాడినవారు తమ అభిప్రాయాన్ని మార్చుకునేవారు. దానిక్కారణం కేసీఆర్ దగ్గర ఎవరినైనా ‘కన్విన్సు’ చేయగల సత్తా ఉండడమే. ఎలాంటి తిరస్కార వాదనను,వ్యతిరేక వాదనను,నిరాశావహ వాదనను అయినా కేసీఆర్ క్షణాల్లో తుంచివేయగల నేర్పరి.అది ఆరు దశాబ్దాలకు పైగా ప్రజల్లో గూడు కట్టుకున్న,తెలంగాణ సమాజం రెండు చేతులూ అడ్డుపెట్టి కాపాడుకుంటూ వస్తున్న ‘వేరు తెలంగాణ’ ఆకాంక్ష దీపం వెలుతురుకున్న బలం.ఉద్యమం పట్ల కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధి,అంకిత భావం,ఆశావహ దృక్పథం,తన ప్రయాణం పట్ల ఉన్న నిబద్ధత,నిజాయితీ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడితీరుతుందన్న బలమైన నమ్మకం.. వెరసి ‘సమైక్య వాదుల’ మనసు మార్చిపారవేసేవి.’తెలంగాణ ద్వేషి’గా ముద్రపడ్డ ఆ సీనియర్ జర్నలిస్టు తన మనసు మార్చుకున్న సమయానికి కేసీఆర్ దీక్ష లేదు.కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం జరగలేదు.చిదంబరం హామీ లేదు.కేసీఆర్ తో సదరు జర్నలిస్టు భేటీ 2009 కి ముందే జరిగింది.

    ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే కేసీఆర్ ‘మాటల మాంత్రికుడు’అని చెప్పడం కోసమే కాదు,జాతీయ స్థాయిలో రాజకీయాల్లో నెలకొన్న శూన్యాన్ని ఎట్లా భర్తీ చేయాలన్న అంశంపై ఆయనకున్న స్పష్టత,అవగాహన మూలంగానే సీనియర్ రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ మంత్ర ముగ్ధుడయ్యారు.అరుణ్ కుమార్ ఒక పట్టాన కన్విన్స్ అయ్యే రకం కాదు.బలవంతానో,భయపెట్టో,మాటల గారడీ చేసో ఆయనను మన దారికి తీసుకురాలేం.ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోని సామాజిక,రాజకీయ విషయాల పట్లనే కాకుండా జాతీయ స్థాయిలోని పరిస్థితులు,వేగంగా మారుతున్న పరిణామాలు వంటి అన్ని అంశాలపైన అవగాహన ఉన్నది.పట్టు ఉన్నది.కనుక ఉండవల్లి త్వరగా మెత్తబడే మనిషి కాదు.లొంగిపోయే మనిషి అంతకన్నా కాదు.సైద్ధాంతికంగా,రాజకీయంగా పొసగని కేసీఆర్ తో మూడు గంటలకు పైగా చర్చలు జరపడం,ఆ చర్చల్లో కేసీఆర్ ప్రదర్శించిన విశ్వాసం,బీజేపీతో రాజీలేని పోరాటం సాగించడానికి చూపుతున్న తెగువ,దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న పట్టుదల ఉండవల్లి అరుణ్ కుమార్ ను మెప్పించాయి.

    దేశ రాజకీయాల్లో ఎవరి బలమేమిటో,ఎవరి బలహీనతలు ఏమిటో క్షుణ్ణంగా అవగాహన ఉన్నది.మమతా బెనర్జీ,స్టాలిన్,శరద్ పవార్,నితీష్ కుమార్,జగన్ ఉద్ధవ్ థాకరే,కేజ్రీవాల్,కుమారస్వామి తదితరులందరి ‘సత్తా’ఏమిటో అరుణ్ కుమార్ కు తెలుసు.ఎవరు ఎవరి ‘శిబిరం’లో ఉన్నారో,ఎవరు గోడమీది పిల్లిగా ఉన్నారో,ఎవరు బీజేపీకి లొంగిపోయారో,ఎవరు సాగిలపడ్డారో వేరే ఎవరూ ఆయనకు చెప్పవలసిన అవసరం లేదు.ఉండవల్లి రాజకీయ పాండిత్యంపై ఎవరికీ సందేహాలూ లేవు.”మోడీకి కేసీఆర్ మాత్రమే సమఉజ్జీ” అని ఉండవల్లి ఒక్క మాటలో తేల్చి పారేశారు. తమ భేటీలో కేసీఆర్ దేశవ్యాప్తంగా వ్యవసాయం, ఇరిగేషన్, మౌలిక సదుపాయాలూ,విద్యుత్తు,పరిశ్రమలు,నిరుద్యోగం..తదితర రంగాల గురించి వివరించినప్పుడు తాను ఆశ్ఛర్యపోయినట్టు ఉండవల్లి చెప్పారు.”కేసీఆర్ ఎంతో హోమ్ వర్కు చేశారు” అని అరుణ్ కుమార్ అన్నారు.

    తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించడానికి ముందు,స్థాపించిన తర్వాత కూడా కేసీఆర్ ‘నిత్య విద్యార్థి’గా కొనసాగిన సంగతి హరీశ్ రావు,ప్రొఫెసర్ జయశంకర్,మధుసూదనాచారి,వి.ప్రకాష్,ఇన్నయ్య వంటి కొంతమందికే తెలుసు.కేసీఆర్ ప్రణాళికలన్నీ ‘అధ్యయనం – ఆచరణ’ తోనే ముడిపడి ఉంటాయి.హోమ్ వర్కు చేయకుండా ఆయన ఏ నిర్ణయమూ తీసుకోరు.ఆయన విజయాలకు అదే వెన్నెముక.
    ”రాజకీయాల నుంచి రిటైర్ అయ్యా.కేసీఆర్ దగ్గర పక్కా ప్లాన్ ఉన్నది.కేంద్రంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసే దిశ‌గా కేసీఆర్ సుదీర్ఘ క‌స‌ర‌త్తే చేశారు. బీజేపీపై కేసీఆర్‌ దీ,నాదీ ఒకే అభిప్రాయం.భారత రాష్ట్ర సమితి గురించి ఎలాంటి చర్చ జరగలేదు.బీజేపీయేతర పార్టీలను లీడ్ చేయడానికి కేసీఆర్ వద్ద పక్కా ప్రణాళిక ఉన్నది.మమతా బెనర్జీ కన్నా కేసీఆర్ మంచి కమ్యూనికేటర్” అని ఉండవల్లి చెప్పారు.

    కేసీఆర్ కున్న పలు అనుకూల అంశాల్లో హిందీ, ఇంగ్లీష్ భాషలపై ఉన్న పట్టు ప్రధానమైనది.భాషపైన పట్టు ఉంటేనే ఏ రాజకీయ నాయకుడైనా మంచి కమ్యూనికేటర్ కాగలరు.పైగా కాంగ్రెస్ జాతీయ నాయకులందరికీ వారి ప్రసంగాల తెలుగు అనువాదకునిగా పనిచేసిన అరుణ్ కుమార్ భాషకు సంబంధించిన ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.”కేసీఆర్ కరెక్ట్ రూట్లో వెళ్తున్నారు !కేసీఆర్ దగ్గర మంచి కాన్సెప్ట్ ఉన్నది.బీజేపీకి చెక్ పెట్టాలంటే విపక్షాలన్నీ ఏకం కావలసి ఉన్నది. దేశంపై కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉన్నది. నెహ్రూకు కేసీఆర్ పెద్ద అభిమాని” అని ఉండవల్లి అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో జగన్, పవన్, చంద్రబాబు కూడా బీజేపీకే మద్దతుదారులని మాజీ ఎంపీ అరుణ్ కుమార్ విమర్శించారు. కనుక ఏపీలోని ఉన్న 25 పార్లమెంట్ సీట్లు ఎవరు గెలిచినా అవి బీజేపీ ఖాతాలోకే వెళ్లినట్లేనని చెప్పారు.

    ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఉన్న బలహీనతలు,నిస్సహాయత అందరికీ తెలిసినవే.ఆయన ఈడీ కేసుల్లో చిక్కుకొని ఉన్నారు.జైలులో 16 నెలలు గడిపి వచ్చారు.అందువల్ల ఆయన బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.ఆయనకు ఈ వైఖరి అనివార్యం. బీజేపీతో పోరాడితే జరిగేదేమిటో జగన్ కు బాగా తెలుసు. రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర దర్యాప్తు సంస్థలతో బిజేపి ఎట్లా ఫుట్ బాల్ ఆడుకుంటున్నదో జగన్ కు తెలియనిది కాదు!

    BJP guts to face Modi
    Previous Articleఈ కథనాలు రాసిన వారికి కనీస జ్ఞానం లేదు
    Next Article రష్యన్ స్టార్ కు అమెరికా ఊరట యూఎస్ ఓపెన్ కు చాంపియన్ మెద్వదేవ్
    Sarvi

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.