Telugu Global
International

ఆ దేశాలపై అన్నంత పని చేసిన ట్రంప్‌

కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాల అమలు ఉత్తర్వులపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు

ఆ దేశాలపై అన్నంత పని చేసిన ట్రంప్‌
X

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ తన పాలనా విధానాల్లో రోజుకో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీనిలోభాగంగా కెనడా, మెక్సికో దిగుమతులతో పాటు చైనాపై సుంకాలు విధిస్తానంటూ పలుమార్లు హెచ్చరించిన విషయం విదితమే. తాజాగా ఆ హెచ్చరికలను నిజం చేశారు. ఆయా దేశాలపై సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు.

నేడు కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాల అమలుకు సంతకం చేశాను. ఫెంటనిల్‌తో సహా మా దేశ పౌరులను చంపే చట్టవిరుద్ధమైన, ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాల ముప్పు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. అమెరికన్లను రక్షించాల్సిన అవసరం మాకున్నది. అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా నా బాధ్యత. చట్టవిరుద్ధ వలసదారులను, మాదక ద్రవ్యాలు మా సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాటిచ్చాను. ఆ మాటకు కట్టుబడి ఉన్నానని తన సోషల్‌ మీడియా ట్రూత్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

First Published:  2 Feb 2025 9:34 AM IST
Next Story