Telugu Global
International

బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక‌

బ్రిటన్ ప్రధాని ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. బ్రిటన్ నూతన ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు.

బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక‌
X

బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు. నెలన్నర క్రితం లిజ్ ట్రస్ చేతిలో ఓడిపోయిన సునక్ ఇప్పుడు ఎన్నికయ్యి చరిత్ర సృష్టించారు.

ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసిన తర్వాత ఎవరు కొత్త ప్రధాని అవుతారో అనే ఉత్కంఠకు తెరపడింది. రిషిక్ కు పోటీ గా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ నిలబడాలని ప్రయత్నించారు కానీ రిషి సునాక్ కు ఉన్న మద్దతు చూసి ఆయన వెనక్కి తగ్గారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా తనకు చట్టసభ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ రిషి సునాక్ కంటే వెనకబడి ఉన్నానని, అఁదువల్ల‌ పోటీ నుంచి వైదొలగడమే మేలని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ బావిం చారు.

అయితే రిషి కి పోటీగా నిలబడ్డ మరో నాయకురాలు పెన్నీ మోర్డాంట్ కు 27 మంది ఎంపీల మద్దతు మాత్రమే లభించడంతో ఆమె కూడా బరిలో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 357 సభ్యులున్న టోరీలో రిషి సునాక్ కు 193 మంది సభ్యుల మద్దతు లభించింది. దాంతో రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు.మొదటి సారి భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ కు ప్రధాని కాబోతున్నారు. అలాగే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి,అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బ్రిటన్‌కు రుషి సునాక్ నాయకత్వం వహించబోతున్నారు

రుషి సునాక్ కు సంబంధించి కొన్ని విశేషాలు:

1. 42 సంవత్సరాల రిషి సునక్ UKలోని సౌతాంప్టన్ ప్రాంతంలో భారతీయ కుటుంబంలో జన్మించారు. అతని తల్లి ఫార్మసిస్ట్ కాగా తండ్రి నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) జనరల్ ప్రాక్టీషనర్.

2. రిషి సునక్ తాతలు పంజాబ్‌కు చెందినవారు.

3. రిషి సునక్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం , లింకన్ కాలేజీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకానమిక్స్ చదివారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంబీఏ చేశారు.

4. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ఆయన వివాహం చేసుకున్నారు. 2009లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు అనుష్క, కృష్ణ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

5. రిషి సునక్ 2015లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నుండి పార్లమెంటు సభ్యుడు (MP) గా ఎన్నికయ్యారు.

6. ఫిబ్రవరి 2020లో, అతను అత్యంత ముఖ్యమైన UK క్యాబినెట్ లో అతి ముఖ్యమైన పదవి అయిన‌ ఆర్థిక మంత్రిగా నియమించబడ్డారు.

7. కోవిడ్ మహమ్మారి సమయంలో ఉద్యోగులు, వ్యాపారాల కోసం రిషి సునక్ ప్రకటించిన‌ ఆర్థిక ప్యాకేజీకి పెద్ద ఎత్తున‌ ప్రశంసలు లభించాయి.

8. నెలన్నర క్రిత‍ం రిషి సునక్ లిజ్ ట్రస్‌కు వ్యతిరేకంగా UK ప్రధానమంత్రి పదవికి పోటీ పడ్డారు.

First Published:  24 Oct 2022 1:43 PM GMT
Next Story