హమాస్- ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో కీలక పరిణామం
హమాస్- ఇజ్రాయెల్‌ల మధ్య దాడుల నేపథ్యంలో బందీల విడుదలకు అంగీకారం తెలపకపోవడంతో హమాస్‌ను బహిష్కరించాలని అమెరికా సూచించింది
హమాస్- ఇజ్రాయెల్‌ల మధ్య దాడుల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హమస్‌ను బహిష్కరించాలని ఖతర్ నిర్ణయించింది. ఖతార్ వేదికగా జరుగుతున్న కాల్పుల విరమణకు ఎన్ని సార్ల చర్చలు జరిపిన బందీల విడుదలకు అంగీకారం తెలపకపోవడంతో హమాస్‌ను బహిష్కరించాలని అమెరికా సూచించింది. ఈవిషయాన్ని ఖతార్ నాయకులకు అమెరికా వెల్లడించింది’ అని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. దీనిపై హమాస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
మరోవైపు తమను బహిష్కరిస్తూ దోహా నాయకులు పేర్కొనడాన్ని హమాస్ నాయకులు ఖండించారు. గత సంవత్సరం అక్టోబరు 7న హమాస్ మెరుపుదాడితో ఇజ్రాయెల్ ఉలిక్కిపడింది. ఆ ఘటనలో 1200 మంది మృతి చెందారు. 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీంతో హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై టెల్‌అవీవ్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఈక్రమంలో గాజాలో ఇప్పటివరకు 43 వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.