4వేలమంది ఉద్యోగులను తొలగించిన ఫిలిప్స్
ఫిలిప్స్ కంపెనీ 4 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కోవిడ్ పరిస్థితి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తమ సంస్థ ప్రదర్శనపై ప్రభావం చూయించాని, అందువల్ల తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫిలిప్స్ సీఈవో రాయ్ జాకబ్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
గ్లోబల్ టెక్నాలజీ సంస్థ ఫిలిప్స్ 4,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ రోజు ప్రకటించింది. ఈ రోజు కంపెనీ తన మూడవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. "ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఉద్యోగుల్లో చురుకుదనం పెంచడానికి" ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిలిప్స్ సీఈవో రాయ్ జాకబ్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
"ఫిలిప్స్ కంపెనీని లాభాలబాటపట్టించడానికి, మా వాటాదారులందరికీ లాభాలు ఇవ్వడానికి ఈ ప్రారంభ చర్యలు అవసరం" అని సీఈవో జాకబ్స్ చెప్పారు.
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కోవిడ్ పరిస్థితి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తమ సంస్థ ప్రదర్శనపై ప్రభావం చూయించాని, క్రితం త్రైమాసికంతో పోల్చితే 5 శాతం తగ్గుదలతో 4.3 బిలియన్ యూరోల విలువైన సేల్స్ మాత్రమే జరిగాయని సీఈవో జాకబ్స్ తెలిపారు.
4 వేల మందిని తొలగించడం కఠిబమైన నిర్ణయమే అయినప్పటికీ తప్పడం లేదని రాయ్ జాకబ్స్ అన్నారు.
ఇది ప్రారంభ చర్యే అని సీఈవో రాయ్ జాకబ్స్ చెప్పడాన్ని బట్టి త్వరలో మరిన్ని చర్యలు ఉండవచ్చని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.