International
ప్రధాని రేసులో మరోసారి ఉండనున్నట్లు రిషి సునక్ ఆదివారం ప్రకటించారు. పార్టీని ఏకం చేసి.. అందరి మద్దతుతో తాను ప్రధాని అవ్వాలని అనుకుంటున్నానని, ఆర్థిక పరిస్థితులను కూడా చక్కదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు.
జింటావో అక్కడి నుంచి కదలడానికి ఆసక్తి చూపించలేదు. కానీ, చివరకు బలవంతంగా అక్కడి నుంచి చేతులు పట్టుకొని తీసుకెళ్లిపోయారు.
అత్యంత ప్రతిష్టాకరమైన పులిట్జర్ అవార్డును పొందిన కశ్మీర్ కు చెందిన ఫోటో జర్నలిస్టు సనా ఇర్షాద్ మట్టూను ఆ అవార్డు అందుకోవడానికి వెళ్ళకుండా భారత ప్రభుత్వం అడ్డుకుంది. దీనిపై పులిట్జర్ అవార్డు నిర్వాహకులు తీవ్రంగా మండిపడ్డారు. ఇది భారత ప్రభుత్వపు అల్పత్వం, చిల్లరతనం అని వారు వ్యాఖ్యానించారు.
అమెరికా, న్యూయార్క్ లో కొన్ని సంవత్సరాలుగా హిందువులు చేస్తున్న పోరాటం ఫలించింది. వచ్చే ఏడాది నుంచి న్యూయార్క్ లోని పాఠశాలలకు దీపావళి సెలవులు ఇవ్వాలని నగర మేయర్ నిర్ణయించారు.
ప్రధాని పదవి రేసులో తాను గెలవలేని పరిస్థితులు ఉంటే మాత్రం.. మరోసారి సునాక్ ఓటమికి బోరిస్ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.
ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినట్లు ట్రస్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నమ్మకాన్ని కూడా తాను కోల్పోయానని వ్యాఖ్యానించారు.
కంజురుహాన్ ఫుట్‌బాల్ స్టేడియంను పునర్నిర్మించడానికి, దేశంలో ఫుట్‌బాల్‌ను అభివృద్ధి చేయడానికి సహాయం చేస్తామని ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాంటినో హామీ ఇచ్చారు.
నూతనంగా ఎన్నికైనా బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ భవిష్యత్తుపై అప్పుడే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొందరు ఆమె ప్రధానిగా కొనసాగింపుపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి.
అణు ప్రమాదాలు జరిగిన తర్వాత అయోడిన్ మాత్రలు ఉపయోగిస్తే, వాతావరణం నుంచి మన శరీరంలో కలిసే రేడియోధార్మిక అయోడిన్ తో పెద్దగా ముప్పు ఉండదనమాట. దీనికోసమే ఇప్పుడు అయోడిన్ మాత్రలు నిల్వ చేసుకుంటున్నారు.
పుతిన్ ఒక వేళ ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించాలని నిర్ణయించుకుంటే అమెరికా గేమ్ ప్లాన్ తో సిద్ధంగానే ఉందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడంతో, రష్యా గ్యాస్ ఎగుమతులపై అదనపు ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది.