Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, June 24
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»International

    ఇక న్యూయార్క్ స్కూళ్ళ‌లో దీపావళి సెలవులు

    By Telugu GlobalOctober 21, 20221 Min Read
    ఇక న్యూయార్క్ స్కూళ్ళ‌లో దీపావళి సెలవులు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    వచ్చే ఏడాది నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో విద్యాసంస్థలకు దీపావళి సెలవులు ఇవ్వాలని న్యూయార్క్ మేయర్ నిర్ణయించారు.

    న్యూయార్క్ లో దాదాపు 2 లక్షల మంది హిందువులు ఉంటారని అంచనా. కాబట్టి హిందువులు జరుపుకునే దీపావళి పండుగకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు మేయర్ ఎరిక్ ఆడమ్స్ చెప్పారు.

    న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడు జెనిఫర్ రాజ్‌కుమార్, న్యూయార్క్ సిటీ స్కూల్స్ ఛాన్సలర్ డేవిడ్ బ్యాంక్స్‌తో కలిసి మేయర్ ఆడమ్స్ మాట్లాడుతూ…

    ” దీపావళి సెలవులపై చాలా రోజులుగా నిర్ణయం పెండింగ్‌లో ఉంది. న్యూయార్క్ నగరంలో దాదాపు రెండు లక్షల వరకు భారతీయులు ఉన్నారు. అంత పెద్ద ప్రవాస సమూహం జరుపుకునే దీపావళి పండుగ ప్రత్యేకతను న్యూయార్క్ లోని స్థానికులు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది” అని అన్నారు.

    న్యూయార్క్‌లో తొలిసారిగా దీపావళి సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది.

    పాఠశాలలకు దీపావళి సెలవులు ఇవ్వాలన్న నిర్ణయం పట్ల న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, మేయర్ ఆడమ్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.

    కొన్ని సంవత్సరాలుగా, న్యూయార్క్ లో నివసిస్తున్న హిందువులు పాఠశాలలకు దీపావళిని సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత కాలానికి తమ డిమాండ్ కార్యరూపం దాల్చినందుకు హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వచ్చే ఏడాది నుంచి న్యూయార్క్ నగరంలో పాఠశాలలకు దీపావళికి సెలవు ఉంటుంది.

    Diwali public school holiday
    Previous ArticleKTR shocked over Liz Truss resignation, highlights Modi’s failures
    Next Article Ori Devuda Movie Review: ‘ఓరి దేవుడా’- మూవీ రివ్యూ {2.5/5}
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.