International

హాలోవీన్ వేడుకలు జరుగుతుండగా.. సమీపంలోని ఒక బార్‌కు సినిమా స్టార్ వచ్చారనే ప్రచారం జరిగింది. దీంతో వందలాది మంది అటు వైపుగా పరుగులు తీశారు.

ఉక్రెయిన్ కు తిరిగి వెళ్ళిన భారతీయ విద్యార్థులు తిరిగి భారత్ కు వెళ్ళిపోవాలని ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి రావడానికి సిద్దంగా లేరు.

మినీ వ్యానులో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. మరణించిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వాళ్లు కాగా, ఒకరు తూర్పు గోదావరి జిల్లా కడియపులంక వాసిగా గుర్తించారు.

వైవిధ్యం పట్ల మనం ప్రదర్శించే గౌరవానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని, వచ్చే ఎన్నికల్లో అదే రీతిలో ఓటర్లు వైవిధ్యమైన తీర్పునివ్వబోతున్నారని చెప్పారు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందన్నారు జైరాం రమేష్.

బ్రిటన్ ప్రధానికి భారతీయ మూలాలుగల రిషీ సునాక్ ఎన్నిక కావడం పట్ల అక్కడి భారతీయులు హ‌ర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తే కాకుండా, అందులోనూ హిందువు ప్రధాని అవ‌డం చూసి ప్రతి ఒక్కరూ చాలా గర్వపడుతున్నార‌ని పలువురు హిందువులు అన్నారు.

ఈ రోజు అనేక దేశాల్లో వాట్సప్ డౌన్ అయిపోయింది. దాదాపు 2 గంటల పాటు వాట్సప్ లో మెసేజ్ లు పంప లేక యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

త‌న‌కు ఎంతో ఇచ్చిన ఈ దేశానికి తిరిగి సేవ చేసే భాగ్యం తనకు దక్కిందని బ్రిటన్ కు ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ అన్నారు. గొప్ప‌దైన గ్రేట్ బ్రిట‌న్ ప్ర‌స్తుతం ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటోంద‌ని, ఈ ఆర్ధిక స‌వాల్ ను అధిగ‌మించేందుకు ఐక‌మ‌త్యంతో స్థిర‌త్వం సాధించ‌డం ముఖ్య‌మ‌ని చెప్పారు.

ఫిలిప్స్ కంపెనీ 4 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కోవిడ్ పరిస్థితి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తమ సంస్థ ప్రదర్శనపై ప్రభావం చూయించాని, అందువల్ల తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫిలిప్స్ సీఈవో రాయ్ జాకబ్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

దేశ అవసరాలు, కన్జర్వేటీవ్ పార్టీ ఐక్యత కోసం పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు బోరిస్ వెల్లడించారు.