ఈవీఎంలపై మరోసారి ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్
ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందని స్పేస్ఎక్స్ అధినేత, బిజినెస్ టైకూన్ ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు
BY Vamshi Kotas20 Oct 2024 1:31 PM IST

X
Vamshi Kotas Updated On: 20 Oct 2024 1:31 PM IST
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లపై స్పేస్ఎక్స్ అధినేత, బిజినెస్ టైకూన్ ఎలాన్ మస్క్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని అన్నారు. ఈవీఎంను రిగ్గింగ్ చేయడం చాలా సులభమని ఆయన అన్నారు. నేనొక టెక్నాలజిస్ట్, కంప్యూటర్ పోగ్రాల గురించి బాగా తెలుసున్నారు.
అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య దేశాలలో పేపర్ బ్యాలెట్ ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలి' అని మస్క్ అభిప్రాయపడ్డారు. కాగా, ఇండియాలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందని, వాటి వాడకాన్ని రద్దు చేయాలని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే
Next Story