ఇజ్రాయెల్ భీకర దాడి.. హిజ్‌బొల్లా కుమార్తె జైనబ్ మృతి
లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడలకు పాల్పడుతోంది. దక్షిణ బీరుట్‌లోని హెచ్‌బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది.
లెబనాన్ పై ఇజ్రాయెల్ భయంకరమైన దాడులకు తెగబడుతోంది. హిజ్‌బొల్లా అధినేత హస్సన్ నస్రల్లాను టార్గెట్ చేస్తూ శుక్రవారం ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. బీరుట్‌లో ఉన్న బిల్డింగ్‌లను టార్గెట్ చేస్తూ దాడులు జరిగాయి. ఆ సిటీలో ఉన్న హిజ్‌బొల్లా కమాండ్ సెంటర్‌పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడి జరిగింది. దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని ఇళ్లు కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి నస్రల్లా కుమార్తె జైనబ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమే మరణంపై హెజ్‌బొల్లా గానీ, లెబనాన్ అధికారులుగానీ అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల్లో ఆరు భవనాలను పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దాదాపు 90 మంది మరణించినట్లు టాక్. మిడిల్ ఈస్ట్‌లో నస్రల్లా ఓ ప్రముఖ నేత. షియా ఇస్లామిస్ట్ గ్రూపునకు ఆయనే పెద్ద. ఇరాన్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగాడు. హిజ్‌బొల్లా గ్రూపును అత్యంత శక్తివంతమైన రాజకీయ, మిలిటరీ సేన్యాన్ని శక్తిగా మార్చడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అతని నేతృత్వంలోనే పాలస్తీనాకు చెందిన ఫ్యాక్షన్ గ్రూపు హమాస్‌కు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇరాన్ నుంచి మిస్సైళ్లు, రాకెట్లను సేకరించాడు. దీంతో ఇజ్రాయిల్‌పై పోరాడేందుకు కావాల్సిన ఆయుధాలను అతను తెప్పించుకోగలిగాడు. తాజా దాడుల్లో నస్రల్లాకు ఏమీ కాలేదని ఓ హిజ్‌బొల్లా వర్గం పేర్కొన్నాది