దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం.. 41 మంది సజీవ దహనం
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం సంభవించింది.
BY Vamshi Kotas9 Feb 2025 11:38 AM IST
![దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం.. 41 మంది సజీవ దహనం దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం.. 41 మంది సజీవ దహనం](https://www.teluguglobal.com/h-upload/2025/02/09/1401763-accidnet.webp)
X
Vamshi Kotas Updated On: 9 Feb 2025 11:38 AM IST
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. 41 మంది సజీవ దహనమయ్యారు. ఈ సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈఘటన జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్లూ ప్రాణాలు కోల్పోగా.. ట్రక్కు డ్రైవర్ కూడా మృతి చెందారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story