బంగారు గనిలో చిక్కుకున్న 100 మంది మైనర్లు మృతి
దక్షిణాఫ్రికాలో ఒక భూగర్భ బంగారు గనిలో చిక్కుకుని సుమారు 100 మంది మృతి చెందారు.
BY Vamshi Kotas14 Jan 2025 6:53 PM IST
X
Vamshi Kotas Updated On: 14 Jan 2025 6:53 PM IST
దక్షిణాఫ్రికాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ నిషేధిత బంగారు గనిలో చిక్కుకోని ఆకలి దప్పులతో 100 మంది కార్మికులు మృతి చెందారు. వీరంతా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు పోలీసులు పలు ప్రయత్నాలు చేసినా విఫలమయ్యారు. మైనింగ్ ప్రభావిత కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ గ్రూప్ ప్రతినిధి సబెలో మ్ంగుని కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
ఆ బంగారు గనిలో దాదాపు 100 మంది వరకు కార్మికులు మృతి చెందినట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. కాగా ఇప్పటివరకు భూగర్భ గనిలో నుంచి 18 మృతదేహాలను బయటకు వెలికి తీసినట్లు తెలిపారు. ఆకలి, డీహైడ్రేషన్ కారణంగా ఆ కార్మికులు అంతా ఆ గనిలోనే చనిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story