National

అమెరికాలో తుపాకీ సంస్కృతికి కళ్లెం వేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. దేశంలో పెరిగిపోతున్న గన్ వయొలెన్స్ ఘటనలను ఇకనైనా అదుపు చేసేందుకు నడుం కట్టింది. ఈ మేరకు గన్ కంట్రోల్ బిల్లుకు సెనేట్ ఆమోదముద్ర వేసింది. 28 ఏళ్ళ తరువాత మొదటిసారిగా సెనేట్ ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుకూలంగా 65 మంది, ప్రతికూలంగా 33 మంది సభ్యులు ఓటు చేసినట్టు బీబీసీ వెల్లడించింది. ఇక ఈ బిల్లును ప్రతినిధుల సభకు పంపుతారు. […]

దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ 8వేల చుట్టూ తిరుగుతున్న కేసులు.. అమాంతం 12వేలకు చేరుకున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ పై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యేలా ఉన్నాయి. అపోహలకు బలం చేకురేలా ఉంది. 8 తర్వాత 9, 10, 11 క్రాస్ చేసుకుని ఒకేసారి కరోనా కేసులు 12వేలకు చేరడంతో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కేసులు 12,213 నమోదయ్యాయి. ముందు రోజుకంటే కేసుల సంఖ్య 38.4 శాతం అధికంగా […]

క్యాన్సర్.. ఈ పేరు వింటేనే ప్రతీ ఒక్కరు హడలిపోతుంటారు. ఒకసారి క్యాన్సర్ సోకితే దేహంలోని ఏ అవయవం అయినా నాశనం కావల్సిందే. క్యాన్సర్ చికిత్స కూడా అత్యంత ఖరీదైన వ్యవహారం. ఏ దశలో దీన్ని గుర్తించినా.. కొంత వరకు మాత్రమే దీన్ని నయం చేసే వీలుంటుంది. పూర్తిగా నయం అయినట్లు డాక్టర్లు చెబుతుంటారు. కానీ చాలా మందిలో ఏదో ఒక రోజు అది తిరగబెట్టడం ఖాయమే. అయితే తాజాగా న్యూయార్క్‌లోని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్‌లో నిర్వహించిన […]

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. ప్రపంచ దేశాలను మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటి వరకూ 20 దేశాల్లో మంకీపాక్స్ విస్తరించినట్టు తెలుస్తోంది. 200 పైగా కేసులు నమోదయ్యాయి, మరో వందమంది అనుమానితులను విడిగా ఉంచి పరీక్షలు చేస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో మొదటగా ఈ వైరస్ ని గుర్తించారు. ఇప్పుడిది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను భయపెడుతోంది. విదేశీ ప్రయాణికులపై నిఘా పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. కొత్తగా మెక్సికో, ఐర్లాండ్ దేశాల్లో కూడా ఈ వైరస్ […]

ప్రపంచమంతా కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడక ముందే కొన్ని దేశాల్లో మంకీపాక్స్ (Monkey pox) వైరస్ కలకలం సృష్టిస్తుంది. దాదాపు 20 దేశాల్లో మంకీపాక్స్ వ్యాపించి, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నది. ఇప్పటికే 200పైగా కేసులు వెలుగు చూడగా.. మరో 100పైగా అనుమానిత కేసులు బయటపడ్డాయి. మన దేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ జాడ లేకపోయినా.. అంతర్జాతీయ ప్రయాణాల నేపథ్యంలో వైరస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. అయితే ప్రారంభ దశలోనే మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఇప్పటి […]

దేశంలో దాదాపు సగం మంది (48 శాతం) విద్యార్థులు నడిచే బడికి వెళ్తున్నట్లు నేషనల్ అఛీవ్‌మెంట్ సర్వేలో తేలింది. స్కూల్ బస్సుల్లో 9 శాతం, ప్రజా రవాణా వాహనాల్లో 9 శాతం, సొంత వాహనాల్లో 8 శాతం మంది విద్యార్థులు స్కూల్స్‌కు వెళ్తున్నట్లు ఆ సర్వేలో తేలింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దేశంలోని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరని.. 65 శాతం మంది టీచర్లపై అదనపు భారం పడుతున్నదని […]

ది క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్) సమ్మిట్‌లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ వెళ్లారు. టోక్యో వేదికగా జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం ఇండియాకు చాలా కీలకంగా మారనున్నది. మన దేశానికి సరిహద్దులుగా ఉన్న పాకిస్తాన్, చైనా నుంచి వస్తున్న ముప్పును ఎదుర్కోవడానికి తగిన సపోర్ట్ కోసం ఈ క్వాడ్ ఉపయోగపడనున్నది. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు సభ్యులుగా ఏర్పడిన ఈ క్వాడ్.. భవిష్యత్‌లో దక్షిణ, తూర్పు ఆసియాలో కీలకంగా మారనున్నది. […]

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంత అల్లకల్లోలం సృష్టించిందో మరిచిపోలేం. అయితే అనారోగ్యాలు, మరణాలే కాదు లక్షలాది మందిని పేదరికంలోకి తోసింది. వందల మందిని బిలయనీర్లను చేసింది. ఆక్స్‌ఫామ్ ఇంట‌ర్నేష‌న‌ల్ రిలీజ్ చేసిన నూతన‌ స‌ర్వే రిపోర్ట్ లో సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా కాలంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి 30 గంట‌ల‌కు ఒక కొత్త బిలియ‌నీర్ పుట్టుకవ‌చ్చిన‌ట్లు ఆక్స్‌ఫామ్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. ఈ కాలంలో 573 మంది కొత్త బిలియనీర్లు తయారయ్యారని నివేదిక తెలిపింది.అలాగే […]

కోవిడ్ భయాందోళనల నుంచి ప్రపంచం పూర్తిగా బయటపడక ముందే ‘మంకీ పాక్స్’ (Monkeypox) రూపంలో మరో వ్యాధి భయపెడుతున్నది. యూరోప్, అమెరికా దేశాలను వణికిస్తూ తాజాగా మరిన్ని దేశాలకు వ్యాపించింది. ఇజ్రాయేల్, స్విట్జర్లాండ్‌లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. రెండు వారాల్లో 100పైగా కేసులు కేవలం 10 దేశాల్లో నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. మంకీపాక్స్ కేసులు ఇలా విస్తరించడం అసాధారణమైన విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వ్యాఖ్యానించింది. నైజీరియా నుంచి ఇండియాకు వచ్చిన ఒక […]

మనదేశంలోని మధ్య వయస్కుల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి రక్తపోటు ఉందని తాజా అధ్య‌యనాలు చెప్తున్నాయి. అసలెందుకు ఈ సమస్య ఇంతగా వేధిస్తోంది. గణాంకాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీఎంఆర్ నిర్వహించిని తాజా సర్వేలో దేశంలో ప్రతీ నలుగురి వయోజనుల్లో ఒకరికి హై బీపీ సమస్య వేధిస్తుందని వెల్లడైంది. వీరిలో కేవలం 12 శాతం మంది మాత్రమే బీపీని కంట్రోల్‌లో ఉంచుకుంటున్నారని మిగతా వారు బీపీతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆ సర్వేలో తేలింది. స్టాటిస్టిక్స్ ఇవే.. […]