Telugu Global
Editor's Choice

దసరా రోజు పాల పిట్టను ఎందుకు చూడాలి?

తెలంగాణలో అయితే శమీ చెట్టుకి పూజ చేసి తర్వాత పాలపిట్టను చూస్తారు.ఇక ఎందుకు పాలపిట్టని చూడాలి అనేది చూస్తే దసరా రోజు పాలపిట్టని చూడడాన్ని నిజంగా అదృష్టంగా భావిస్తారు.

దసరా రోజు పాల పిట్టను ఎందుకు చూడాలి?
X

తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా..అన్ని వర్గాల ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే శమీ చెట్టుకి పూజ చేసి తర్వాత పాలపిట్టను చూస్తారు. ఇక ఎందుకు పాలపిట్టని చూడాలి అనేది చూస్తే విజయదశమి రోజు పాలపిట్టని చూడడాన్ని నిజంగా అదృష్టంగా భావిస్తారు. నిజానికి దసరా అంటే చెడు పై మంచి గెలవడం. అయితే దసరా రోజు మంచి కలగాలంటే పాలపిట్టను చూడాలి అని అంటారు పాలపిట్ట కనిపిస్తే విజయం అందుకున్నట్లుగా భావిస్తారు అదృష్టానికి సంకేతముగా పరిగణిస్తారు. అధర్మంపై విజయం సాధించినందుకు విజయ దశమి జరుపుకుంటారు. దీని వెనుక అనేక కధలు ఉన్నాయి. సురులను, ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని దుర్గాదేవి అంతమొందించిన రోజు విశయదశమిగా పిలుస్తారు.

సీతాదేవిని అపహరించిన రావణుడిపై యుద్దంలో ఇదే రోజున విజయం సాధించారని పురాణాల్లో ఉంది. అజ్ఞాతవాసంలో ఆయుధాలని పాండవులు శమీ వృక్షం పైనే దాచిపెట్టారు. తర్వాత విరాటుడు కొలువులో ఉన్న పాండవులు ఏడాది పూర్తయ్యాక మళ్లీ ఇదే వృక్షం దగ్గరికి వచ్చి శమీ వృక్షాన్ని పూజించి ఆయుధాలని తీసుకుంటారు. అపరాజితా దేవి ఆశీస్సులు వృక్ష రూపంలో వచ్చాయని భావించి కౌరవులపై విజయాన్ని సాధిస్తారు పాండవులు. మరోవైపు దసరా అంటే..దస్+హరా..అని అర్థం వస్తుంది. హిందీలో దస్ అంటే తెలుగులో పది అని మీనింగ్. 10 తలల రావణాసురుడిని రాముడు హతమార్చిన సందర్బంగా అన్న మాట..మొదట్లో దశహరా అని విజయ దశమిని అనే వారు కాలక్రమంగా దసరాగా మారింది.

పురాణాల ప్రకారం పాలపిట్ట చాలా శుభకరమైనదిగా భావిస్తారు. ఈ పక్షిని చూసిన తర్వాత శ్రీరాముడు రావణుడిపై జరిపిన యుద్ధంలో విజయం సాధించాడని పురణాలు చెబుతున్నాయి. నీలకంఠ పక్షిని చూసే సంప్రదాయం ఈ మంచితనపు విజయోత్సవంలో ఏళ్ల తరబడి కొనసాగుతోంది. రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు వచ్చినప్పుడు బ్రాహ్మణుడిని చంపిన పాపం అతనిపై మోపబడిందని కూడా చెబుతారు. తన పాపాలకు పశ్చాత్తాపం చెందడానికి అతను లక్ష్మణుడితో కలిసి పరమేశ్వరుడిని పూజించాడు. అందుకు శివుడు సంతోషించి నీలకంఠ పక్షి రూపంలో రాముడు, లక్ష్మణునికి దర్శనమిస్తాడు. అందువల్ల దసరా పవిత్ర సందర్భంగా నీలకంఠ పక్షిని చూడటం శుభప్రదంగా పరిగణిస్తారు.

First Published:  12 Oct 2024 7:55 AM GMT
Next Story