Editor’s Choice
షరియా చట్టం పేరుతో ఇరాన్ ప్రభుత్వం మహిళలపై అనుసరిస్తున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఇరానీ మహిళ తిరుగబడింది. హిజబ్ సరిగ్గా ధరించనందుకు పోలీసులు అరెస్టు చేసిన ఓ యువతి పోలీసు కస్టడీలో మరణించడంతో ఇరాన్ ఒక్క సారి భగ్గుమంది.
లోటస్ పాండ్ లాంటి ఇంద్రభవనం, షర్మిల ఎక్కడయినా రాళ్లు కొట్టి సంపాదించిందా? కూలి చేసి కూడబెట్టిందా? షర్మిల భర్త అనిల్ కుమార్ ప్రార్థనలు చేసి పోగుచేశాడా’? అని సగటు టిఆర్ఎస్ కార్యకర్త ప్రశ్నిస్తున్నాడు.షర్మిల పాదయాత్రకు రోజుకు రూ.25 నుండి రూ.30 లక్షలు ఖర్చు అవుతున్నట్టు ఒక అంచనా.
నిజాం వ్యతిరేక పోరాటంగా గుర్తించడానికే బీజేపీ సిద్ధంగా ఉంది తప్ప దానిని భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా గుర్తించదలచుకోలేదు. రజాకార్లు చేసిన అత్యాచారాలు,హత్యలు భూస్వాముల అండతో జరిగినవేనన్న వాస్తవాలను సంఘ్ పరివార్ అంగీకరించదు.
రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి క్రీడల్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఏ ఆటలో ప్రతిభ ఉన్నా, వారిని మరింత సానపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. ఆ ఆటలో వారు మరింత రాటుదేలేలా శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపనుంది.
రాహుల్ గాంధీ యాత్ర మొదలైనప్పటి నుంచి బీజేపీ ఏదో ఒకరకంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తోంది. ఇప్పుడు ఆ పని కాంగ్రెస్ మొదలు పెట్టింది. ఖాకీ నిక్కర్ కి నిప్పు పెట్టిన ఫొటో.. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
”ఎవరైనా బలపడాలి అంటే సంకల్ప బలం ఉండాలి. సంకల్పించిన తర్వాత దాన్ని విడిచిపెట్టరాదు. గట్టిగా పట్టుకోవాలి. ఇక మిగతావన్నీ వాటంతట అవే వాళ్ళను అనుసరిస్తాయి”. అని ప్రసిద్ధ తత్వవేత్త ఫ్రెడరిక్ నీషే అన్నాడు. కేసీఆర్ ఇదే తత్వంతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 (96) వృద్ధాప్య సమస్యల కారణంగా స్కాట్లాండ్‌లోని బోర్మోరల్ క్యాజిల్‌లో కన్నుమూశారు.
సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి, ఎంపీ ఉత్తమ్ తదితర సీనియర్ల మద్దతును కూడగట్టడంలో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయవంతమయ్యారు. అయితే రేవంత్ రెడ్డికి ఢిల్లీలో పరపతి ఉండడం మిగతా నాయకులకు మింగుడు పడటం లేదు.
ఎనిమిదేళ్లకు పైనుంచి బీజేపీ కేంద్రంలో వైభోగాన్నిఆస్వాదిస్తోంది. అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అయితే నిశితంగా పరిశీలిస్తే దీర్ఘకాలికంగా బీజేపీ మనుగడ మీద అనుమానపు క్రీనీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితి మోదీ ప్రధాని అయిన 2014 నుంచే ఉన్నా గతేడాది కాలంలో మరింత తీవ్రమైంది.
మిగిలిన కార్డులతో తమకు సంబంధం లేదని వాదిస్తోంది. దాంతో తెలంగాణ ప్రభుత్వమే సొంత డబ్బులతో మిగిలిన కార్డులకు బియ్యాన్ని అందిస్తోంది. ఇందుకు ఏటా 3వేల 800 కోట్లను రాష్ట్రం భరిస్తోంది.