Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, June 12
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Editor's Choice

    ఆర్ఎస్ఎస్ నిక్కర్ కి నిప్పు.. బీజేపీ కస్సుబుస్సు..

    By Telugu GlobalSeptember 12, 2022Updated:March 30, 20252 Mins Read
    ఆర్ఎస్ఎస్ నిక్కర్ కి నిప్పు.. బీజేపీ కస్సుబుస్సు..
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వేసుకున్న టీషర్ట్ విషయంలో ఎంత రాద్ధాంతం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ నిక్కర్ ని టార్గెట్ చేసింది. ఖాకీ నిక్కర్ కు మంటలు అంటుకున్నట్టుగా ఉన్న ఒక ఫొటోను కాంగ్రెస్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ద్వేషం నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు, బీజేపీ-ఆర్ఎస్ఎస్ వల్ల జరుగుతున్న నష్టాలను ఆపేసేందుకు.. ఒక్కొక్క అడుగు ముందుకు వేసి ల‌క్ష్యాన్నిచేరుకోబోతున్నట్టుగా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాలిపోతున్న ఖాకీ నిక్కర్ కింద ‘145 డేస్ టు గో’ అనే క్యాప్షన్ ఇచ్చారు.

    To free the country from shackles of hate and undo the damage done by BJP-RSS.

    Step by step, we will reach our goal.#BharatJodoYatra pic.twitter.com/MuoDZuCHJ2

    — Congress (@INCIndia) September 12, 2022

    రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇంకా 145 రోజులు మిగిలి ఉందని, బీజేపీ ముక్త భారత్ కి కూడా ఇంకా 145 రోజులే టైమ్ ఉందన్నట్టుగా సింబాలిక్ గా క్యాప్షన్ పెట్టారు. దీంతో సహజంగానే బీజేపీకి మంటపెట్టినట్టయింది. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారడంతో బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖాకీ నిక్కర్ కు ఎందుకు నిప్పుపెట్టాల్సి వచ్చిందంటూ నిలదీస్తున్నారు.

    అది భారత్ తోడో యాత్ర..

    రాహుల్ గాంధీ చేస్తోంది భార‌త్ జోడో యాత్ర కాదని, అది భార‌త్ తోడో యాత్ర అని.. ఆగ్ ల‌గావో యాత్ర అని ఆరోపిస్తున్నారు బీజేపీ నేత సంబిత్ పాత్ర. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఖాకీ నిక్కర్ కి నిప్పంటించిన ఫొటోని వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు.

    రాహుల్ గాంధీ యాత్ర మొదలైనప్పటినుంచి బీజేపీ ఏదో ఒకరకంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తోంది. ఇప్పుడు ఆ పని కాంగ్రెస్ మొదలు పెట్టింది. ఖాకీ నిక్కర్ కి నిప్పు పెట్టిన ఫొటో.. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఒక్కొక్కరే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పై మండిపడుతున్నారు. యాత్ర మొదలైన తొలివారంలోనే ఇలా ఉంటే, ఇక ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.

    Congress Party Fire
    Previous Articleపరుగుతో రోగాలు… పరుగో పరుగు
    Next Article కేసీఆర్ జాతీయ పార్టీ.. వైఎస్ జగన్ కలయికపై ఆసక్తికరమైన చర్చ
    Telugu Global

    Keep Reading

    వరంగల్ ఎయిర్‌ఫోర్టు క్రెడిట్ కోసం కాంగ్రెస్‌, బీజేపీ తన్నులాట

    పేదల ముఖాల్లో నవ్వులు చూడాలి..అప్పుడే ప్రభుత్వాన్నికి సార్థకత : మీనాక్షి

    పేరు రైతులది.. పైసలు కాంట్రాక్టర్లకు!

    రేవంత్‌ విన్నపాలపై రాహుల్‌ రాడార్‌!

    వివాదాలు, విభేదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా కాంగ్రెస్‌

    మాటల్లో రాజ్యాంగ రక్షణ.. చేతల్లో రాజ్యాంగ భక్షణ

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.