Telugu Global
CRIME

హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
X

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకున్నాది. భర్తతో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలి శ్రీరాంనగర్‌ కాలనీలోని సీ బ్లాక్‌లో ఉన్న ఆమె.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని సుసైడ్‌కు పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆమె కన్నడలో పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందారు.

శోభిత భర్త సాఫ్ట్‌పేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బెంగళూరు తరలించనున్నట్టు సమాచారం. 2023లో పెళ్లి అనంతరం నటనకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

First Published:  1 Dec 2024 7:16 PM IST
Next Story