Crime
ప్రమాదంలో భాగ్యశ్రీ, నితిన్‌కుమార్, కమలాదేవి అక్కడికక్కడే మృతిచెందగా, నాగషణ్ముఖ్, డ్రైవర్ వంశీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఏలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం సచిన్ పాలి గ్రామంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృత్యువాత చెందగా, పలువురు గాయపడ్డారు.
హథ్రాస్ జిల్లా సికింద్రారావు సమీపంలోని ఫుల్‌రాయ్ గ్రామంలో తనకు తానే దేవుడిగా ప్రకటించుకున్న భోలే భాబాకు సంబంధించిన ప్రార్థనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు.
పేదింట పెను విషాదం చోటుచేసుకుంది. మట్టి ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పనికి వెళుతున్న యువతిని రోహిత్ వెంబడించి.. ఇనుప రెంచీతో దాడి చేశాడు. ఆమెను తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. తమ రాయబారి బాధితులను తరలించిన ఆస్పత్రికి వెళ్లారని తెలిపారు.
కిడ్నీ రాకెట్‌లో సూత్రధారి రాంప్రసాద్ అని సిట్ అధికారులు గుర్తించారు. అతను కేరళలోని అలువాకు చెందిన మధుతో కలిసి ఈ దందా నడిపినట్లు తమ దర్యాప్తులో తేల్చారు.
ఈ దాడిలో అక్కడికక్కడే 8 మంది రక్తసంబంధీకులు చనిపోయారు. అప్పటిదాకా పచ్చగా కనిపించిన పెళ్లి పందిరి దాడితో రక్తసిక్తమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి తరలించారు.
ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ప్రాణనష్టం భారీగా వాటిల్లింది. శిథిలాల కింద నలిగిపోయిన వారి కోసం గ్రామస్థులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ఈ హత్యలో హనీ ట్రాప్ ఒక కీలక అంశంగా పరిగణిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను బట్టి ఎంపీని గొంతునులిమి హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఉంటారని భావిస్తున్నామన్నారు.