Telugu Global
CRIME

మెద‌క్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఏడుగురు దుర్మరణం

మెద‌క్ జిల్లాలోని శివంపేట‌లో బుధ‌వారం సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు వ్య‌క్తులు మృతి చెందారు.

మెద‌క్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఏడుగురు దుర్మరణం
X

మెదక్ జిల్లా శివంపేటలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో న‌లుగురు మ‌హిళ‌లు, ఇద్ద‌రు బాలిక‌లు ఉన్నారు. ఉసిరిక‌ప‌ల్లి వ‌ద్ద వేగంగా వెళ్లిన ఓ కారు ఆ గుంతలో పడి ఎగిరి చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఏడుగురు వ్య‌క్తులు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవ‌ర్ తీవ్ర గాయాల పాల‌య్యారు. ఉసిరిక‌ప‌ల్లి నుంచి వెల్దుర్తి వ‌ర‌కు ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప‌నులు కొన‌సాగుతున్నాయి.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న డ్రైవ‌ర్‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాల‌ను ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను పాముబండ‌ తండా, ర‌త్నాపూర్, తాళ్ల‌ప‌ల్లి వాసులుగా గుర్తించారు. ఈ ప్ర‌మాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

First Published:  16 Oct 2024 12:40 PM
Next Story