Telugu Global
CRIME

మోస్టు వాంటెండ్ ధూల్ పేట్ గంజాయి డాన్ అరెస్టు

మోస్ట్ వాటెంట్ గంజాయి డాన్ అంగూర్‌ బాయ్‌‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

మోస్టు వాంటెండ్ ధూల్ పేట్ గంజాయి డాన్ అరెస్టు
X

మోస్ట్ వాటెంట్ గంజాయి డాన్ అంగూర్‌ బాయ్‌‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దూల్‌పేట్ నుంచి ఐటీ కారిడార్ వరుకు అంగూర్ బాయ్ గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. రిటైల్ గంజాయి విక్రయిస్తూ.రూ.100 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. దాదాపు 10 కేసుల్లో నిందితురాలిగా ఉండి ఇప్పటి వరుకు తప్పించుకుని తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. క్రమంలో అపరేషన్‌ ధూల్‌పేట్‌లో భాగంగా ఇవాళ కార్వాన్ ప్రాంతంలో ఆమెను ఎస్టీఎఫ్, ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే, గంజాయి అమ్మకాల్లో రూ.కోట్లకు పడుగలెత్తిన అంగూర్‌ బాయ్‌పై ధూల్‌పేట్‌ ఎక్సైజ్‌ పోలీస్‌‌స్టేషన్‌లో 3, మంగళ్‌హట్‌ పీఎస్‌లో 4, ఆసిఫ్‌నగర్, గౌరారం స్టేషన్లలో 10 కేసుల్లో ముద్దాయిగా ఉన్నది. ఈ కేసుల్లో అరెస్టు చేయడానికి ఎక్సైజ్‌, పోలీసులు ఎన్నిమార్లు నిఘా పెట్టిన అంగూర్‌ తప్పించుకొని తిరుగుతు.. ఇప్పుడు దొరికిపోయాడు.

First Published:  12 Dec 2024 7:34 PM IST
Next Story