హైదరాబాద్‌లో భారీ దోపిడీ.. 2.5 కిలోల బంగారం చోరి
హైదరాబాద్‌లో బంగారం వ్యాపారి ఇంట్లో నుంచి 2.5 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు
BY Vamshi Kotas12 Dec 2024 8:33 PM IST
X
Vamshi Kotas Updated On: 12 Dec 2024 8:33 PM IST
హైదరాబాద్‌లో భారీ దోపిడీ జరిగింది. దోమలగూడ పరిధి అరవింద్ కాలనీలో బంగారం వ్యాపారి ఇంట్లో నుంచి 2.5 కిలోల గోల్డ్ దుండగులు చోరీ చేశారు. సినీ ఫక్కీలో వ్యాపారి రంజిత్, అతని సోదరుడి ఇళ్లలోకి చొరబడిన 10 మంది దుండగులు కత్తులు, తుపాకులతో బెదిరించారు. లాకర్‌లోని రూ.2.5 కిలోల బంగారం, మూడు ఫోన్లు, ఐ ట్యాబ్, సీసీటీవీ డీవీఆర్ అపహరించారు. దుండగుల దాడిలో వ్యాపారి రంజిత్‌కు గాయాలయ్యాయి. తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. విపరీతంగా క్రైమ్ రేటు పెరుగుతుంది.. మరోవైపు రాష్ట్రంలో హోం మంత్రి లేడు. హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి మర్డర్ మానభంగాలు పెరిగాయి.
Next Story