ఈత కోసం వచ్చి డ్యామ్‌లో పడి ఐదుగురు మృతి
సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది.
BY Vamshi Kotas11 Jan 2025 3:17 PM IST

X
Vamshi Kotas Updated On: 11 Jan 2025 3:17 PM IST
సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యామ్‌లో ఈత కోసం వచ్చి ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మొత్తం ఏడుగురు డ్యాంలోకి దిగినట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు యువకులు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు. ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. వీరంతా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి సంభవించిన వివరాలను ప్రాణాలతో బయటు పడిన తోటి మిత్రులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. సరదాగా ఈత కోసం ఐదుగురు ఒకే సారి మరణించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మృతులు ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్‌గా గుర్తించారు.
Next Story