చర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ చర్లపల్లిలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది.
BY Vamshi Kotas4 Feb 2025 8:03 PM IST
X
Vamshi Kotas Updated On: 4 Feb 2025 8:03 PM IST
హైదరాబాద్ చర్లపల్లిలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది.చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రసాయనాల ఘాటుతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. రహదారి పక్కనే ఉండడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
చర్లపల్లి పారిశ్రామికవాడలోని సర్వోదయ రసాయన పరిశ్రమలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రసాయనాల ఘాటుతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story