Telugu Global
CRIME

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
X

మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో కూతురు సహా భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన చెక్‌పోస్ట్‌ వద్ద ఇవాళ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఓ కుటుంబం బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు కూతురు మృతి చెందింది.

ఈ ప్రమాదంలో వారి కుమారుడి కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆ బాలుడి రెండు కాళ్లు విరిగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

First Published:  5 Jan 2025 6:00 PM IST
Next Story