Telugu Global
CRIME

కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు

ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు
X

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని అందులో పేర్కొన్నది. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో ఇప్పటికే ఒకసారి నోటీసులు ఇవ్వగా.. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో కేటీఆర్‌ గడువు కోరారు. తాజాగా ఆయన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ క్రమంలో ఈడీ మరోసారి కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది.


First Published:  7 Jan 2025 4:00 PM IST
Next Story