Telugu Global
CRIME

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నేడు విచారణకు చిరుమర్తి

లింగయ్యను విచారించిన అనంతరం మరికొంతమంది నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నేడు విచారణకు చిరుమర్తి
X

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. నేడు జూబ్లీహిల్స్‌ పోలీసుల ఎదుట మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటివరకు ఈ దర్యాప్తు అధికారులవైపే కొనసాగించిన అధికారులు తాజాగా రాజకీయ నాయకులపై దృష్టి సారించారు. లింగయ్యను విచారించిన అనంతరం మరికొంతమంది నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ నేతలకు నోటీసులు ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నేతలకు, పోలీసులకు మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణపై అరెస్టైన నలుగురు నిందితులు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావు, రాధాకిషన్‌ రావులకు సంబంధించినటువంటి ఫోన్‌ కాల్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పోలీసులు పంపించారు. ఆ నివేదిక ఆధారంగా తిరుపతన్న కాల్స్‌ లిస్టులో చిరుమర్తి లింగయ్య డేటా దొరకడంతో ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఆయనతోనే సంప్రదింపులు జరిపిన మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.

First Published:  14 Nov 2024 6:35 AM GMT
Next Story