Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, May 22
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎందరో!

    By Raju AsariNovember 14, 20241 Min Read
    ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎందరో!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. సంగీతం నేర్చుకోకున్నా బాగాపాడేవారు చాలామంది ఉంటారు. ఈ క్రమంలో రాజు అనే అంధ గాయకుడి స్వరం ఇప్పుడు అందరి హృదయాలను హత్తుకుంటున్నది. అతను ఆర్టీసీ బస్సులో సరదాగా పాడిన పాట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కొన్నిరోజుల నుంచి ఈ వీడియో విస్తృతంగా వైరల్‌ అవుతున్నది. తాజాగా ఈ గాయకుడిని ఉద్దేశించి మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ పోస్ట్‌ పెట్టారు. అతను కచ్చితంగా ఇండియన్‌ ఐడల్‌లో పాడుతాడని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ కార్యక్రమం ప్రసారమయ్యే ఓటీటీ సంస్థకు తమన్‌ విజ్ఞప్తి చేశారు.

    ‘ఈ అబ్బాయి కచ్చితంగా ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 4లో పాడుతాడు. అతనికి గొప్ప టాలెంట్‌ ఉన్నది. ఆ వేదికపై అతనితో కలిసి నేను ప్రదర్శన ఇస్తాను. శృతిలో ఎంత స్పష్టంగా పాడుతున్నాడో.. దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉన్నట్లు కనిపిస్తాడు. అయితేనేం .. అతని టాలెంట్‌ను గుర్తించి అవకాశం ఇవ్వడానికి మనం ఉన్నాం కదా’ అని పోస్టులో తమన్‌ పేర్కొన్నారు. ఇక నాలుగు రోజుల కిందట ఈ యువకుడి టాలెంట్‌పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కూడా పోస్ట్‌ పెట్టారు. ఆ యువకుడికి ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి అంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని కోరారు. ‘మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..! ఈ అంధ యువకుడు అద్భతంగా పాడారు కదా.. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్‌’ అని సజ్జనార్‌ కోరారు.

    Blind singer Raju,Indian Idol
    Previous Articleభావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భట్టి కొత్త భాష్యం
    Next Article ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నేడు విచారణకు చిరుమర్తి
    Raju Asari

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.