Telugu Global
CRIME

చత్తీస్ గఢ్‌‌లో మరో ఎన్ కౌంటర్‌..12 మంది మావోయిస్టులు మృతి

చత్తీస్ గఢ్‌‌ భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు

చత్తీస్ గఢ్‌‌లో మరో ఎన్ కౌంటర్‌..12 మంది మావోయిస్టులు మృతి
X

చత్తీస్ గఢ్‌ భారీ ఎన్ కౌంటర్‌ జరిగింది. భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. నారాయణపూర్, దంతెవాడ, జగదల్ పూర్, కొండగావ్ జిల్లాల్లో నేడు భద్రతా బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ లో భాగంగా కూంబింగ్ నిర్వహించాయి.

ఈ నేపథ్యంలో, తెల్లవారుజామున 3 గంటలకు భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. మావోయిస్టులు కాల్పులు జరపడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు కూడా కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇప్పటిదాకా 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలో యాంటీ నక్సల్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ కూంబింగ్‌లో డీఆర్‌జీ, ఎస్‌ఎటీఎస్, సీఆర్‌పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. ఈ ఎన్ కౌంటర్‌తో ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కి పడ్డాయి.

First Published:  12 Dec 2024 3:28 PM IST
Next Story