Telugu Global
CRIME

పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

భూపాలపల్లి జల్లా కాటారం మండలం కేంద్రంలోని మీనాక్షి పత్తి మిల్లులో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
X

జయశంకర్ భూపాలపల్లి జల్లా కాటారం మండలం కేంద్రంలోని మీనాక్షి పత్తి మిల్లులో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మిల్లులో సుమారు 2వేల క్వింటాళ్ల పత్తి ఉందని స్ధానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పారు. రూ.కోటి మేర నష్టం జరిగినట్లు మిల్లు యాజమాన్యం తెలిపింది. ఖమ్మం పత్తి మార్కెట్‌లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలకు దాదాపు మూడు వందల పత్తి బస్తాలు దగ్దమయ్యాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకొన్న సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు సైతం తెలియ రాలేదు. సంక్రాంతి పండగ కావడంతో.. పత్తి మార్కెట్‌కు జనవరి 16వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. అయితే పండగ తర్వాత పత్తిని విక్రయిద్దామని పలువురు రైతులు.. తమ పత్తి పంటను ఈ మార్కెట్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.

First Published:  16 Jan 2025 6:06 PM IST
Next Story